Education is not for a Job, Telugu Neethi విద్య ఉద్యోగానికి కాదు…విద్య అంటే విజ్ఞానం..

By Blogger Passion Jun 20, 2021

Education is not for a Job, Telugu Neethi విద్య ఉద్యోగానికి కాదు…విద్య అంటే విజ్ఞానం..

#నేటి_యువత_తెలుసుకోవాల్సిన_విషయం👇

#పిల్లలు_పెంపకంపై_ఓ_తండ్రి_ఆవేదన 👇

అందరూ బీటెక్కులూ, మెడిసిన్లే సదవాలి..

అందరూ సాప్టు”వేర్లు” అయిపోవాలి..

అందరూ DSC లే రాయాలి..

అందరూ bank exams కే prepare అవ్వాలి..

.

.

.

సివరాకరికి

అందరూ ఉద్యోగాలే సెయ్యాలి..

130 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో 30 కోట్లకు పైగా ఉన్న యువతలో అందరికీ ఉద్యోగాలే రావాలంటే ఎలా వస్తాయి బాస్?

30 కోట్ల మంది విషయం పక్కన పెడదాం..

దాంట్లో 3%…

అంటే కోటి మందికి ఉద్యోగాలు వస్తాయా?

అది సాధ్యమా?

కోటి ఉద్యోగాలను ఇస్తాం అని అప్పుడెప్పుడో2014లో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ తీర్చలేకపోయారు.. అది అనుకున్నంత సులభం కాదు..

దేశస్థాయిలో వద్దు..

మన తెలుగు రాష్ట్రాల వరకూ మాట్లాడుకుందాం..

ప్రభుత్వోద్యోగాల విషయానికి వస్తే,

DSC (టీచర్)ఉద్యోగాలు కనీసం 3 ఏళ్లకు ఒకసారి అయినా వస్తున్నాయా?

ఇక Group 1,2 ఉద్యోగాల కోసం ఎదురుచూడడం కంటే బుద్ధితక్కువ పని మరొకటి ఉండదు…

2012 group 1 results పైన ఇప్పటికీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి..

Bank exams పేరుతో నంద్యాల గురురాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో అక్షరాలా 35,000 మందికి పైగా నిరుద్యోగులు prepare అవుతూనే ఉన్నారు..

అవనిగడ్డలో ఇంకెందరో..

ఇక ప్రై”వేటు” ఉద్యోగాలు..

ఉద్యోగం అంటేనే software అనే రేంజ్ లో ఎదిగిపోయిన ఈ sector కోసం అందరూ engineering లో CSE, IT branch లలో చేరిపోయి, చదువు అయిపోగానే అమీర్ పేటకు బ్యాగులు సర్దేసుకుని, ఏ naresh technologies లోనో, kalyan IT లోనో చేరి, జావాలు, .net లూ, ఒరాకిళ్ళు, మిరాకిళ్ళు, AWS లూ, DBA లూ, cloud లూ, sky లూ, పిండాకూడులూ, శ్రార్ధాలు అన్నీ నేర్చేసుకుని ఉద్యోగాలు రాక, back door లో నుండో, side door నుండో కూడా ప్రయత్నించి.. అక్కడ కూడా కుదరక ఏ బ్యాగునైతే సర్దుకుని అమీర్ పేటదాకా వచ్చారో, అదే అమీర్ పేటలో బస్సెక్కి జీవితంపైన నిరాశతో ఊరికి వెళ్లిపోయిన నిరుద్యోగులు “లక్షల్లోనే”..

ఓ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది అని తెలిస్తే, వాటి కోసం గ్రౌండ్లో 5km running practice చేసే P.G. students ఎందరో..

ఒక M.Tech చేసిన కుర్రాడు కానిస్టేబుల్ అయ్యాడు.. నేను సాక్ష్యం.

.

.

.

రెండేళ్ల క్రితం జరిగిన VRO recruitment కు Ph.D చేసిన విద్యార్థులనుండి దరఖాస్తులు వచ్చాయి.. అంటే, ఇక ఏమి చెప్పాలి?

ఇంతటి దుస్థితికి కారణం ఎవరో తెలుసా?

.

.

.

మనమే!

2 1/2 ఏళ్లకే పిల్లలను ఎత్తి ఏదో ఒక దిక్కుమాలిన play school లో వేసేస్తాం..

కొన్ని స్కూళ్లలో 4 వ తరగతికే IIT coaching అంట..

పెట్టిన వాడికి సిగ్గులేకపోతే మనకు బుద్ధిలేదా?

ఆ వయసు పిల్లలకు కనీసం writing రాయడం కూడా సరిగ్గా రాదు.. అప్పుడే IIT చదివెయ్యాలా..

ఇక్కడ కక్కుర్తి కమండలాలు ఎవరంటే ఇక్కడ తల్లిదండ్రులే

(ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే, దయచేసి ఎక్కడైనా దూకి సచ్చిపోండి)

IIT లు, e concept లు, e learning లు, e techno ల పేరుతో వాళ్ళు ఫ్లెక్సీలు, బోర్డులు, పాంప్లెట్లు చూపించగానే ఎత్తి ఆ స్కూళ్లలో దిగబెట్టే మనది తప్పు..

ఇంటర్మీడియట్ రాగానే ఊపిరి పీల్చుకోలేని ఒత్తిడిని చూపించే మనది తప్పు..

10 లక్షల మందికి పైగా EAMCET exam రాస్తే కనీసం 5000 మంది కూడా top colleges లో చేరలేని దౌర్భాగ్యం..

ఏదో చెప్పేసి మిమ్మల్ని డైలమాలో పడేద్దామని కాదు..

.

.

.

.ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం..

ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడే US, UK, Australia లలో మీరు ఎప్పుడైనా ఇలాంటి EAMCET , IIT coaching centres ను గానీ, Concept schools ను గానీ, చూశారా.. కనీసం విన్నారా?

అక్కడ ఉండవు..

ఎందుకో తెలుసా?

అక్కడ పిల్లలను మనలాగా చదువు, చదువు, చదువు, మార్కులు, మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు, డబ్బులు అంటూ వేధించరు…

పిల్లలు ఏ రంగంలో అయితే రాణిస్తారో, ఏదైతే చేయగలరో, జీవితానికి సంబంధించిన వాటివైపే ప్రోత్సహిస్తారు..

అదే ఆ దేశాల విజయ రహస్యం!

ఒకప్పుడు మన చదువులు కూడా అలానే ఉండేవి..

ఏ చెట్టు క్రిందనో, ఏ గురుకులంలోనో ఒక మనిషి జీవితంలో విజ్ఞానాన్ని, వినయాన్ని, విధేయతను, ప్రాపంచిక జ్ఞానాన్ని, కష్టాలు వస్తే పోరాడే పటిమను.. ఇలా ఎన్నెన్నో విషయాలను బోధించేవారు..

ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించారో, విద్యను వారి వ్యాపారాలకు అనుగుణంగా మలచి చదువులను ఉద్యోగాలకు పరిమితం చేశారు..

మన చదువులను వాళ్ళు ఎత్తుకుపోయారు..

వాళ్ళ చదువులను మనకు అంతగట్టారు..

అందుకే వాళ్ళు అలా.. మనం ఇలా…

ఒక్కటి మాత్రం వాస్తవం!

పిల్లలను engineering చెయ్యి, medicine చదువు, నువ్వు పోలీస్ కావాలి, CA చెయ్యాలి.. అది నాకు ఇష్టం, మీ తాత కల, దాంట్లో డబ్బులు బాగా వస్తాయి అంటూ మన వ్యక్తిగత ఇష్టాలను వాళ్లపై రుద్దితే, ఫలితం ఇలానే… రోడ్లపైకి వచ్చి, చుట్టూ ఉన్న దిక్కుమాలిన సంతతో…మీ అబ్బాయి ఏమి చేస్తున్నాడు, ఇంకా ఉద్యోగం రాలేదా? ఇంకా settle అవ్వలేదా లాంటి ప్రత్యక్ష నరకాన్ని ప్రతీ క్షణం అనుభవించేలా చేస్తుంది!

విద్య ఉద్యోగానికి కాదు…విద్య అంటే విజ్ఞానం..

విద్య అంటే ప్రపంచం..విద్య అంటే జీవితం..!📕📖  

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

Related Post

Leave a Reply

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.