Puli Meka Telugu Katha for Kids, పులి – మేక |ఆవు – పులి కథ | Cow and Tiger Story Moral Stories for kids

ఆవు – పులి కథ | Cow and Tiger Story

కథ:
ఒక ఊళ్ళో ఒక ఆవు వుండేది, అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది.
ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా , బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది, పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆవుచూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది.
ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు కొంచం ఆలకించు..నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో, కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను అని వేడుకుంది.
ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది, ఒహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా, చాలా ఆకలిమీదున్నాను నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదుల్తా ననుకున్నావా.
అయ్యో!  పులి రాజ నన్ను నమ్ము నేనెప్పుడూ అసత్యమాడలేదు, నువ్వుదయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చివస్తాను, నిన్ను మోసగించి నేను బతకగలనా అయినా ఆ అసత్యపు జీవితం నాకు ఏల ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్య కార్యముందా నన్ను నమ్ము.
పులి ఆవుమాటలకు నవ్వి సరే వెల్లు కాని మళ్ళీ తిరిగిరాకపోయావో ఈ రోజుకాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు అప్పుడు చెపుతా నీ సంగతి అంది.
అంతమాటలకే సంతోషించిన ఆవు ఆగమేగాలమీద ఇళ్ళు చేరుకుని తన బిడ్డకి కడుపునిండా పాలిచ్చి, బిడ్డా ఇదే నా ఆఖరిచూపు, మంచి దానిగా మసులుకో, బుద్దిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలద్దు, జీవితంలో ఎప్పుడూ అబద్దం ఆడరాదు, సత్యాన్నే పలుకు అది నీకు మేలు చేస్తుంది, అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్దులు చెప్పి సెలవుతీసుకుని అడవికి బయలుదేరింది.
అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి, దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది, ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది, అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడనికి తిరిగి వస్తుంది.
తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంత గొప్పది, ఇలాంటి సత్యవంతురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది.
ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాల నువ్వు ఎంత సత్యవంతురాలివి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది, నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు.
నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఎదో విధంగా తీర్చుకుంటాను నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది.ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది.
Cow and Tiger Story
ఈ కథలోని నీతి:
చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది.

పులి మేక 

Puli Meka katha telugu lo stories

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

పులి-మేక : –
—————

రామానుజన్ గారు చెప్పిన పాత కథ ఒకటుంది.

మేకపిల్ల ఒకటి ఒక రోజున ఒంటరిగా వాగులో నీళ్లు తాగుతున్నది.
దానికి కొద్ది గజాల దూరంలోనే – పై వైపున, ఒక పులి మంచినీళ్లు తాగేందుకని వచ్చి ఉన్నది.అది మేకపిల్లను చూడగానే అన్నది – “నువ్వు నా నీళ్లను ఎందుకు పాడుచేస్తున్నావు?” అని.

మేకపిల్ల అన్నది – “నువ్వు తాగే నీళ్లు నావల్ల ఎలా పాడౌతాయి?

 నేనేమో కింది వైపున ఉన్నాను – నువ్వు పై వైపున ఉన్నావు!” అని.


“కానీ నువ్వు పాడుచేసింది ఇవ్వాళ్ల కాదు – నిన్న.” అన్నది పులి.
“నిన్న అయితే నేను అసలు ఇక్కడికి రానే లేదు!” అన్నది మేకపిల్ల.


“అయితే ఆ పని మీ అమ్మ చేసి ఉండాలి.” అన్నది పులి.

“మా అమ్మ చచ్చిపోయి చాలా కాలమైంది. వేటగాళ్లు ఏనాడో ఆమెను ఎత్తుకపోయారు!” అన్నది మేక.

“అయితే నా నీళ్లను పాడుచేస్తున్నది కచ్చితంగా మీ నాన్నే.”


“మా నాన్నా?! మా నాన్న ఎవరో నాకే తెలీదు! ఆయనెలా – ?” అన్నది మేకపిల్ల, ఎలాగైనా పారిపోదామని లేచి నిలబడుతూ.


“నాకదేమీ తెలీదు. నా వాగు నీళ్లను పాడుచేస్తున్నది మరి మీ తాతైనా అయ్యుండచ్చు. వాళ్ల నాన్నైనా అయి ఉండచ్చు. అందుకని నేను నిన్ను తినాల్సిందే.” అని, పులి మేకమీదికి దూకి దాన్ని తినేసింది.

ఒక పని చేద్దామని నిశ్చయించుకొని, ఆ తర్వాత దాన్ని అడ్డగోలుగా సమర్థించుకొనే వాళ్లతో మాట్లాడటం వ్యర్థమే అవుతుంది. 

వాళ్ల మనసుల్లో ఏది ఉందో వాళ్లు దాన్నే చేస్తారు – మాటలు మనకు కనీసం తప్పుకొనేందుకు కూడా అవకాశాన్నివ్వవు. 

అలాంటివాళ్లకు ఎదురుపడకుండా ఉండటమే మంచిది. ఎదురుపడ్డప్పుడు వాదనల్లో సమయాన్ని కోల్పోవడం కంటే, మౌనంగా వెనక్కి తగ్గి, వేరే దారి వెతుక్కోవడమే శ్రేయస్కరం అవుతుంది. ఏమంటారు?


రాఖీ పండుగ. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ, భారతీయ సంప్రదాయపు సౌరభాన్ని నలుదిశలా వెదజల్లుతున్నది. ఇక, ఈ సంచికలోని పాట “డాక్టరుగారు వచ్చారు” ను చిన్నారి నితిన్ గుంటూరు జిల్లానుండి సొంత దస్తూరితో రాసి పంపాడు. 


ఆ చిన్నారికి, మీకందరికీ కూడాను- ” తెలుగు కధలు – telugu stories” అభినందనలు. 


puli meka katha telugu lo stories పులి మేక


monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


Related Post

Leave a Reply

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.