ఫ్యాసింజర్స్ తో నిండిన ఓ బస్ హైద్రాబాద్ నుండి విజయవాడ వైపుగా వెళుతుంది. 
వారి వారి సీట్లలో కూర్చున్న ప్రయాణికులు, పక్కవారితో ముచ్చట్లు పెట్టుకుంటూ కొందరు, తమ తమ స్మార్ట్ ఫోన్ లతో మరికొందరు బిజీబిజీ గడుపుతున్నారు. బస్ సీట్ల నాల్గవ వరుసలో కుడివైపు కిటికీ పక్కన 52 యేళ్ల తండ్రి, 24 యేళ్ల కొడుకు కూర్చొని ఉన్నారు. అదే వరుస ఎడమ కిటికీ వైపు కొత్తగా పెళ్లైన దంపతులు కూర్చొని ఉన్నారు.

బస్ ముందుకు వెళుతున్నా కొద్ది…. కొడుకు….వావ్ డాడీ…….ఆ చెట్లను చూడండి, మన వెనక్కి వెళుతున్నాయ్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని గమనించిన కొత్త దంపతులు తండ్రిని, కొడుకుని వింతగా చూశారు.

Image result for blind person glasses
మరికొద్దిసేపటికి, డాడీ….చెట్లలాగే కొండలు కూడా వేగంగా వెనక్కి వెళుతున్నాయి అంటాడు…ఈ సారి మరింత ఆశ్చర్యంగా చూస్తారు దంపతులు.

telugu lo stories Blind Person Travelling Moral

ఇంకాసేపటికి….డాడీ….ఆకాశంలోని మేఘాలు చూడండి…మనం ఎటు వెళ్తే అవి కూడా అటే వస్తున్నాయ్. అంటూ చప్పట్లు చరుస్తూ చెబుతాడు కొడుకు. అప్పటి వరకు ఓపికతో ఉన్న ఆ దంపతులు…ఏంటండీ….24 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి ఇలా సిల్లీగా బిహేవ్ చేస్తుంటే…డాక్టర్ కు చూపించాల్సింది పోయి…మీరు కూడా అతని వెర్రి మాటలకు నవ్వుతారేంటి? అని కోపగించుకున్నారు దంపతులు.

అప్పుడు ఆ తండ్రి…కరెక్టేనమ్మా…మా బాబును ఇప్పుడే డాక్టర్ దగ్గరి నుండి తీసుకువస్తున్న…వాడు పుట్టుకతోనే అంధుడు…ఆపరేషన్ తర్వాత వాడికి తిరిగి కళ్లు వచ్చాయి. కళ్లు వచ్చాక….ఇదిగో ఇదే మొదటి సారి బస్ ఎక్కడం అందుకే వాడిలో ఆ ఎగ్జైట్ మెంట్…మనం మొదటిసారి బస్ ఎక్కినప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు మన నుండి వెనక్కి వెళుతున్నాయి అని మీరు కూడా అనుకునే ఉంటారు..బహూషా మీకు గుర్తు ఉంటే ఉంటుంది?…ప్రస్తుతం నా కొడుకు పరిస్థితి కూడా అదే..! అని సమాధానం ఇచ్చాడు తండ్రి, సారీ సార్ అన్నారు దంపతులు.

Moral: ఇతరుల పరిస్థితిని తెలుసుకోకుండా….మనమే ఓ అభిప్రాయానికి రావడం తప్పు, ఇక మనమనుకున్నదే కరెక్ట్ అనుకొని వాదించడం ఇంకా పెద్ద తప్పు.

telugu lo stories Blind Person Travelling Moral

Telugu lo Stories | Moral Stories for Kids | Telugu Kathalu for Kids


Spread the love

Comments

Leave a Reply

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.