గోవిందుని తెలివి Govinduni Telivi Kathalu, Telugu Moral Stories

 Govinduni Telivi Kathalu, Telugu Moral Stories

గోవిందుని తెలివి |  తెలుగు నీతి కథలు | Telugu Moral Stories


ఒకరోజున గోవిందుకి వాళ్ళనాన్న ఒక చిన్న వెండి పెట్టెను ఇచ్చి “గోవిందా! ఈ పెట్టెను తీసుకొనివెళ్ళి ప్రక్కఊారిలోనున్న మీ మామయ్యకు యిచ్చి తిరిగి త్వరగా వచ్చేయ్‌! నీవు పెందరాళే బయలుదేరివెళ్తే మళ్ళీపొద్దు పోయేలోపు యింటికి రావచ్చు!” అని చెప్పాడు.

గోవిందువెంటనే బయలుదేరి 2గం,ల్లో వాళ్ళ మామయ్య గారింటికి చేరుకొన్నాడు. వాళ్ళ మామయ్యకు ఆపెట్టెను యిచ్చివేశాడు. వాళ్ళ అత్తయ్య గోవిందుకు పిండివంటలతో చక్కటి భోజనం పెట్టింది. కొంతసేపైన తర్వాత వాళ్ళ మామయ్యవచ్చి “నేను పెట్టెలోని వస్తువుల్ని తీసుకొన్నాను. ఇంక నీవీపెట్టెను తిరిగి తీసుకొని వెళ్ళవచ్చును.” అని గోవిందుకు ఆ వెండి పెట్టెను యిచ్చి “బాబూ! జాగ్రత్తగా వెళ్ళు. దారిలో టక్కరిదొంగలుంటారు.” అని చెప్పి, గోవిందుని సాగనంపాడు.

కొంతదూరం వెళ్ళిన తర్వాత ఎవరో దొంగ తనవెనకే వస్తున్నట్లు గోవిందుకు అనుమానం వచ్చింది. ఏం చేయాలో తోచక పరుగులంకించుకొన్నాడు. ఆ దొంగకూడా పరుగెత్తడం మొదలుపెట్టాడు. దార్లో ఒక నుయ్యి కన్పించింది. కొంచెం నీళ్ళుత్రాగి వెళ్ళామని నూతి దగ్గరకు వెళ్ళాడు.

దొంగ అంతకంతకూ దగ్గరగా వస్తున్నాడు. వెంటనే గోవిందుకు మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. పెద్దగా అరుస్తూ “అమ్మోయ్‌! బాబోయ్‌! నేనిప్పుడు ఏంచేసేదిరా దేవుడోయ్‌!” అని కేకలు వేయడం మొదలెట్టాడు. అప్పుడా దొంగ దగ్గరగావచ్చి “ఏంబాబూ! ఎందుకేడుస్తున్నావు?” అన్నాడు. వెంటనే గోవిందు “నేను నీళ్ళుతోడు తుంటే నాచేతి గొలుసు, ఉంగరం,

వాచీ నూతిలో పడిపోయాయి. అవిలేకుండా యింటికి ఎట్లా వెళ్ళాలి?” అన్నాడు.

“వెండిపెట్టె కంటే అవే మేలు. బంగారు గొలుసు, ఉంగరం, వాచీ-వాటిని అమ్ముకొంటే బోలెడంత డబ్బువస్తుంది” అని అనుకొన్నాడు దొంగ.

“బాబూ! నువ్వు ఇక్కడే ఉండు. నేను నీ వస్తువులను పైకితెస్తాను” అని, వెంటనే దొంగ నూతిలోనికి ఉరికాడు.

*నా ఆలోచన ఫలించింది! ఇప్పుడు నేను వెండి పెట్టెతో క్షేమంగా యింటికి పోవచ్చును” అనుకొని పరుగెత్తుకొంటూ యిల్లు చేరాడు గోవిందు.


నీతి:- తెలివితో ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు

 
Kids Moral Stories
Telugu Moral Stories
  గోవిందుని తెలివి తెలుగు నీతి కథలు నీతి కథలు KIDS MORAL STORIES TELUGU MORAL STORIES

 

బాతు – బంగారు గ్రుడ్డు Duck and Golden Egg

in Kids stories telugu  by Well Wisher


బాతు – బంగారు గ్రుడ్డు Duck and Golden Egg

బాతు – బంగారు గ్రుడ్డు Duck and golden egg ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది . ఆ బంగారు గ్రుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం…
Read More

 మిడాస్ స్పర్శ Midas Touch

in Kids stories telugu  by Well Wisher


మిడాస్ స్పర్శ Midas Touch

 మిడాస్ స్పర్శ Midas Touch ప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్. ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం. ఆ రాజు కి చాలా సంపద ఉంది. అతనికి ఒక చక్కని కూతురు కూడా ఉంది.   ఒక రోజు ఆ రాజు బంగారు నాణాలు…
Read More

ఒక పిసినారి కథ The story of a pisinari | Friendship stories |

in Kids stories telugu  by Well Wisher


ఒక పిసినారి కథ The story of a pisinari | Friendship stories |

ఒక పిసినారి కథ –  The story of a pisinari ఒక పల్లె లో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేని వాడు, ఉండేవాడు.    అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న…
Read More

రైతు – బావి – Farmer and well

in Kids stories telugu  by Well Wisher


రైతు – బావి - Farmer and well

రైతు – బావి – Farmer and well ఒక అమాయకుడైన రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాని వద్ద ఒక బావిని కొన్నాడు.   నీటికోసం బావి దగ్గరకి వెళితే, పక్కవాడు, “నువ్వు బావి కొన్నావు కానీ నీళ్ళని…
Read More

మనిషి – పిల్లి కధ – Man and the Cat 

in Kids stories telugu  by Well Wisher


మనిషి – పిల్లి కధ - Man and the Cat

మనిషి – పిల్లి కధ – Man and the Cat  ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదలో చిక్కుకుని, బైటికి రాలేక, అరుస్తోంది. “మ్యావ్, మ్యావ్” అన్న అరుపు విని ఒక అతను దానిని చిక్కులోంచి బైటకి తీసుకురావాలని…
Read More

చెడు అలవాట్లు Bad Habits

in Kids stories telugu  by Well Wisher


చెడు అలవాట్లు Bad Habits

చెడు అలవాట్లు – Bad habits ఒక ధనికుడు తన పిల్లవాడి చెడు అలవాట్లని చూసి చాలా విచారించాడు.   ఒక వివేకమైన సలహాదారుడిని ఈ విషయం కోసం నియమించాడు. ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని తనతో…
Read More

Dog and a Well story | Bed Time Story | కుక్క – బావి కథ

in Kids stories telugu  by Well Wisher


Dog and a Well story | Bed Time Story | కుక్క – బావి కథ

కుక్క – బావి కథ – Dog and a well story అనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది.   ఒకరోజు తనపిల్లలతో ఊళ్ళోతిరుగు…
Read More

 నాన్నా, అదిగో తోడేలు Dad its a Wolf – Moral Story – Lier

in Kids stories telugu  by Well Wisher


నాన్నా, అదిగో తోడేలు Dad its a Wolf - Moral Story - Lier

 నాన్నా, అదిగో తోడేలు Dad its a wolf ఒకానొక గుట్ట మీద చిన్న పల్లెటూరు. ఒక రైతు, తన చిన్న కొడుకుని గొర్రెలు కాయటానికి తనతో తీసుకెళ్లాడు. పిల్లవాడిని గొర్రెలు చూస్తూ ఉండమని, తోడేలు వస్తే…
Read More

నలుగురి స్నేహితులు Four best friends

in Kids stories telugu  by Well Wisher


నలుగురి స్నేహితులు Four best friends

నలుగురి స్నేహితులు Four best friends ఒక కాలేజ్ లో నలుగురు స్నేహితులున్నారు. వాళ్లకి చదువు అంటే ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీ కెళ్ళి, మర్నాడు పరీక్షరాయకుండా, తిన్నగా…
Read More

నిజమైన స్నేహితులు True friends

in Kids stories telugu  by Well Wisher


నిజమైన స్నేహితులు True friends

నిజమైన స్నేహితులు – True friends శ్రీ కృష్ణుడు,సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది,పెరిగి,సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే తన భార్య,పిల్లలతో అవస్థలు…
Read More

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


Latest Job Vacancies & News CLICK HERE

Health and Yoga with Devotional – CLICK HERE

Related Post

Leave a Reply

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.