aaku matti bedda telugu lo stories kathalu ఆకు-మట్టిబెడ్డ
ఆ వృక్షరాజపు కొనకొమ్మకు చివరన- అన్నింటికంటే పెద్దఆకు ఒకటి ఉండేది. చల్లటి గాలులు మెల్లగా జోల పాటలు పాడుతుంటే అది హాయిహాయిగా కొమ్మ ఉయ్యాలలూగేది. ‘ఇంతకు మించి ప్రపంచంలో మరే ఆనందమూ లేదు. ఇదే స్వర్గం’ అనుకుంటుండేది. ‘ఎప్పటికైనా తను నేల రాలాల్సిందే’అన్న నిజాన్ని మరిచిపోయి, ఆ తాత్కాలిక సుఖంలో ఓలలాడేది.అదే కొండ శిఖరంమీద మట్టిగడ్డ ఒకటి ఉండేది. ఎత్తైన ప్రదేశంలో ఉండీ ఉండీ , దానిలో ‘తాను ఉన్నతమైనది’ అన్న భావన స్థిరపడిపోయింది. హోరునవీచే గాలులు దానికి సుమధుర సంగీతంలా తోచేవి. ‘తనను మించినది ప్రపంచంలో మరేదీ లేదు’ అన్న ఆనందంతో అది ఎప్పుడూ పులకరించిపోతుండేది.
https://www.youtube.com/watch?v=10zuAVSuKH0
ఒక రోజున గాలులు ఉధృతంగా వీచాయి. గాలి తాకిడికి మట్టిపెళ్ల విరిగింది. అంత ఎత్తు నుండి పర్వత పాదం వరకూ పడ్డది. ఉన్నతమైన తన స్థానం కోల్పోయినందుకు, పర్వతాగ్రం నుండి కిందికి దిగి రావల్సి వచ్చినందుకు అది విపరీతంగా బాధపడింది. గాలిని బాగా తిట్టుకున్నది. వీలైనన్ని శాపనార్థాలు పెట్టింది.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
ఇంతలో, చెట్టు కొనకొమ్మన ఆనందంలో ఊగిసలాడుతున్న ఆకు కూడా ఆ గాలికి కొమ్మనుండి వేరైంది. అది కూడా నేల రాలింది. తనకు చాలా అన్యాయం జరిగిందనిపించింది దానికి. కోపమూ, ఏడుపూ ఒకేసారి క్రమ్ముకురాగా అది ఎంతో విచారించింది. అలాగే గింగిరాలు తిరుక్కుంటూ కొట్టుకుపోతుంటే, వేరే ఎక్కడినుండో తిట్లు వినబడ్డాయి దానికి. అటు పోయి చూస్తే, అక్కడ ఉన్నది మట్టిగడ్డ! ‘ఎందుకు, అంత బాధ పడుతున్నావు?’అని దాన్ని అడిగింది ఆకు. అలా అవి రెండూ ఒకదానికొకటి గత జీవిత వైభవాన్ని గురించీ, ప్రస్తుతకాలపు కష్టాలను గురించీ చెప్పుకున్నాయి. అట్లా తమ బాధల్ని పంచుకోవటంవల్ల, రెండింటి హృదయాలూ కొంత తేలిక పడ్డాయి. త్వరలోనే రెండూ మంచి మిత్రులయ్యాయి. రెండూ ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి: మట్టిపెళ్ల అన్నది, “ఒకవేళ వర్షం వస్తే, నాపైన నువ్వు ఉండి, నేను కరిగిపోకుండా కాపాడు” అని. ఆకు అన్నది, “తీవ్రమైన గాలులు వచ్చినప్పుడు, నువ్వు నామీద ఉండి, నేను ఎటూ కొట్టుకుపోకుండా చూడు” అని. ఇద్దరికీ లాభమే! తమ భద్రతకు ఇక తిరుగులేదనుకున్నాయి రెండూనూ. ఆ ఆనందంలో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాయి.
msconfig for windows
https://www.youtube.com/watch?v=UEtqPZV9NAI