Elephant saved by Lord Vishnu – గజేంద్రుని భక్తి – భగవంతుని ఆరాటాన్ని – పోతన
* నా కింక ధైర్యం లేదు *
* ప్రాణాలు పోయేట్లున్నాయి *
* నేను పూర్తిగా అలసిపోయాను *
* మూర్చ వస్తుంది * ఈశ్వరా ! నీవే నాకు దిక్కు *
* దీనుడవై నన్ను మన్నించి * వచ్చి కాపడవయ్యా *
అని ఆ గజరాజు తొండం ఎత్తి ఆకాశం వైపు
చూస్తూ మొరపెడుతున్నాడు *
విశ్వమాయ తమకు లేని కారణంగా
గజేంద్రుని మొర విని కూడా బ్రహ్మాది దేవతలు రక్షింపదలపలేదు *
భక్తుడైన విష్ణువు రక్షింప దలచాడు *
వైకుంఠంలో ఉన్నా విష్ణువు *
గజేంద్రుని మొర విని *
లక్ష్మీదేవికైనా చెప్పకుండా *
శంఖ చక్రాలను చేబూనకుండా *
తన వాహనమైన గరుత్మంతుని పిలవకుండ *
గజేంద్రుని రక్షించడానికి ఆకాశమార్గంలో
* బయలు — దేరాడు *
విష్ణువు వెంట లక్ష్మీదేవి *
అమె వెంట అంతః పురకాంతలు *
ఆ వెనుక గరుత్మంతుడు *
శంఖ చక్రాదులు * నారదుడు *
* మొదలైన వారంతా వెళ్ళారు *
లక్ష్మీదేవి చేలాంచలము
అప్పటికీ విష్ణువు చేతిలోనే ఉంది *
అది ఆయన గమనించనే లేదు *
తానూ వెంట వస్తున్న విషయాన్ని
ఈ మహానుభావుడు గమనించలేదు *
కారణమేమై ఉంటుందని లక్ష్మీదేవి
రకరకాల ఆలోచనలు చేసింది *
తన స్వామి అంత వేగంగా ఎక్కడికి ఎందుకు
వెలుతున్నాడో అడగాలని లక్ష్యీదేవి అనుకుంది * అడిగితే జవాబు చెప్తాడో …..*
లేదో …… అని అడగలేకపోయింది *
విష్ణువు మొదలుగా
వైకుంఠపురంలోని ఆబాలగోపాలమంతా
ఆకాశమార్గంలో తరలివెళుతుంటే
దేవతలు చూచి నమో నారాయణా
అంటూ స్తుతించారు *
గజేంద్రుడున్న సరస్సును చూచి
విష్ణువు తన చక్రంతో మొసలి
తలను తెగవేశాడు * గజేంద్రుని రక్షించాడు *
అట్లా రక్షింపబడిన
గజేంద్రుడు ఆనందించాడు *
గజేంద్రుని భక్తి * భక్తుని రక్షించాలన్న
భగవంతుని ఆరాటాన్ని * పోతన ఈకథను
ఎంతో మనోహరంగా చిత్రించారు *
* ఓం నమో నారాయణాయ నమః *
By
* మీ, రాజు సానం *
Comments