how to loss weight in 7 days easy steps telugu lo health tips ఏడు రోజుల్లో బరువు తగ్గండి..
ఇందులో మాయా మర్మం ఏమీ లేదుకదా?
లేకపోతే అధిక కొవ్వును ఆపరేషన్ ద్వారా తొలగిస్తారా?
అసలు నెలలో ఇన్ని కిలోల బరువు తగ్గడం సాధ్యమయ్యే పనేనా?
ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయికదూ!
ఒక వారంలో మూడున్నర కిలోల బరువు తగ్గడం అంటే మాటలు కాదు.
కానీ, అదేమీ కష్టం కాదు అంటున్నారు నిపుణులు. తాము సూచించే వారం రోజుల డైట్ ప్లాన్ తూచా తప్పకుండా పాటిస్తే బరువు కచ్చితంగా తగ్గుతారంటున్నారు.
శరీరం మీద చిన్నపాటి గాటు కూడా పెట్టించుకోకుండా బరువు తగ్గేందుకు వారు చెబుతున్న వారం రోజుల డైట్ ప్లాన్ వివరాలు…
భోజనం చేయకూడదా?:
వారం రోజుల పాటు కూరగాయలు లేదా పళ్ళు తిని ఉండాలంటే కొద్దిగా కష్టమే!
అలా వుండలేని వారు కొద్దిమొత్తంలో అన్నాన్ని రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
భోజనంలో కూడా పోషకాలతో పాటు ఫైబర్ అధికంగా వుండే విధంగా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు.
కింద ఇచ్చిన డైట్ ప్లాన్‌లో ఆహారాన్ని రోజు మొత్తంమీద కొద్ది కొద్దిగా తీసుకోవాలని వారు చెబుతున్నారు.
1.సోమవారంపళ్ళతోవిందు
:శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపాలంటే పళ్ళతో విందు మంచి మార్గం.
ఇంకెందుకు ఆలస్యం? ఈ సోమవారాన్ని పళ్ళ డైట్‌తో ప్రారంభించండి.
పళ్ళ డైట్ అంటే బోలెడన్ని పళ్ళు తినేసి బ్రేవ్ మని తేన్చడం కాదు.
రోజు మొత్తం మీద నాలుగు ఆపిల్స్. నాలుగు ఆరంజ్‌లు, రెండు దానిమ్మ, ఒక వాటర్ మిలన్ పండు తినాలి.
అలా రోజును పూర్తి చేయండి.
పళ్ళు తింటే బోలెడంత సమయం పడుతుంది కదా, ఆ పళ్ళతో జ్యూస్‌లు తయారు చేసుకుని తాగితే బాగుంటుంది కదా అనుకునేరు. ఆ పని అస్సలు చేయకండి.
ఎట్టి పరిస్థితుల్లోనూపళ్ళ జ్యూస్‌లను దగ్గరకు రానీయకండి.
సరిపడా పళ్ళు తింటున్నాం కదా, నీరు ఎందుకు దండగ అనుకునేరు…
పది గ్లాసుల నీరు తాగడం మర్చిపోకండి.
పై పళ్ళు, పది గ్లాసుల నీరు సోమవారం డైట్‌లో తప్పనిసరిగా వుండాల్సిందే!
ఈ వారం రోజులూ ఉదయమే గోరువెచ్చని నీటిలో స్పూను తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగండి.
ఈ నీరు తాగిన తరువాతే మీ డైట్‌ను మొదలుపెట్టండి.
వ్యాయామం:
నడకను మించిన వ్యాయామం లేదంటారు కదా? రోజూ అరగంట పాటు నడిచేవారు మరో పది నిమిషాలు పొడిగించుకోండి.
అదీ బ్రిస్క్ వాక్ చేస్తే మరీ మంచిది.
2.మంగళవారంకూరగాయలు మాత్రమే:
మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో రెండవ రోజు వచ్చేసింది.
ఈ రోజు కూరగాయలు మాత్రమే తీసుకోండి. వాటిని పచ్చిగా తిన్నా సరే లేదా సలాడ్స్, అంతగా కాకపోతే ఉడకబెట్టినవి తినండి.
చప్పగా తినడం కష్టంగా వుంటే వాటి మీదచిటికెడు ఉప్పు కొద్దిగా మిరియాల పొడి చల్లుకుని తినండి. ఆకలి అనిపించినప్పుడల్లా ఈ కూరగాయలను తినేయండి.
వీటికి వెన్న, క్రీమ్, పాలు, నూనె వంటివి అస్సలు కలుపుకోకండి.
ఉదయమే గ్లాసు గోరువెచ్చని నీరుతాగిన తరువాత ఉడికించిన బంగాళాదుంప తినండి.
అదే మీ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది.
లంచ్, డిన్నర్‌కి పచ్చి లేదా ఉడికించిన కూరగాయలు తీసుకోండి.
3.బుధవారంఅరటిపండు, పాలు:
ఈ రోజు మీ ఆహారం పది అరటిపండ్లు, మూడు గ్లాసుల పాలు, గిన్నెడు డైట్ సూప్.
ఈ కొద్దిపాటి ఆహారంతో ఆకలి తీరలేదు అనుకుంటే చాలా తక్కువ మొత్తంలో అన్నం తినండి.
అన్నానికి బదులు గోధుమ లేదా జొన్న రొట్టె తీసుకుంటే ఇంకా మంచిది వీటితో పాటు నీరు తాగే శాతాన్ని కొద్దిగా పెంచండి.
పది గ్లాసులు కాకుండా పన్నెండు గ్లాసుల నీరు తాగితే మంచిది.
4.గురువారంఈ రోజు మీకు ఇష్టమైనన్ని పళ్ళు కూరగాయలు తీసుకోండి. కూరగాయలను వెన్న లేదా నూనె వేసి తయారు చేసినవి మాత్రం తినకండి.
పచ్చివి తింటే మరీ మంచిది అలా కాకుండా ఉడకబెట్టినవి కూడా తీసుకోవచ్చు.
ఈ రోజు కూడా పన్నెండు గ్లాసులనీరు తాగడం మరిచిపోకండి.
వీటితో పాటు పళ్ళు, కూరగాయలు కలిపి తయారు చేసుకున్న సలాడ్‌ను తీసుకోండి.
పళ్ళ జ్యూస్‌లకు దూరంగా వుండండి
5.శుక్రవారంఈ రోజు పళ్ళు కూరగాయలతో పాటు చిన్న గిన్నెడు బ్రౌన్‌రైస్, చిన్న కప్పు పప్పుతో పాటు గ్లాసు పలుచని మజ్జిగాతీసుకోండి.
ఈ రోజు కనీసం ఆరు టమోటాలు, రెండు ఆపిల్స్, రెండు ఆరంజ్ పళ్ళు తీసుకోండి.
వీటితో పాటు ప్రతిరోజూ లాగే సలాడ్‌ను తీసుకోండి.
ఈ రోజు తాగే నీటి కోటాను ఇంకా కొద్దిగా పెంచండి.
మరో రెండుగ్లాసుల నీరు అదనంగా అంటే మొత్తం పధ్నాలుగు గ్లాసుల నీరు తాగండి.
6.శనివారంపై రోజుల్లో ఏదో ఒక రోజు డైట్‌ని ఈ రోజు ఫాలో అయిపోండి.
ఈ రోజు కూడా తాగే నీరు తగ్గకుండా చూసుకోండి.
అదనంగా ఓ కప్పు గ్రీన్ టీని అదనంగా చేర్చండి.
ఈరోజు వీలుంటే కాఫీ, టీలకు గుడ్‌బై చెప్పేయండి.
సలాడ్స్ షరా మామూలే!
7.ఆదివారంచిట్టచివరి రోజు. ఏడురోజుల డైట్‌ప్లాన్‌కి బైబై చెప్పేయాలని అనుకునే రోజు.
మీకిష్టమైన కూర గాయలను చిన్ని గిన్నె పప్పు, బ్రౌన్‌రైస్‌తో కలిపి ఉడి కించుకుని తీసుకోండి.
వీటితో పాటు గ్లాసు పలుచని పాలు, చిన్న గిన్నె సలాడ్‌ను కూడా తీసుకోండి.
ఈ రోజు మాత్రం ఓ గ్లాసు తాజా పళ్ళరసాన్ని చక్కెర లేకుండా తాగండి.