మిడాస్ స్పర్శ
Midas Touch
ప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్. ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం. ఆ రాజు కి చాలా సంపద ఉంది. అతనికి ఒక చక్కని కూతురు కూడా ఉంది.
ఒక రోజు ఆ రాజు బంగారు నాణాలు లెక్కించుకుంటూ ఉండగా ఒక అదృష్ట దేవత ఎదురుగా కనపడింది. రాజు చాలా ఆదరించి, గౌరవించాడు. అతని మర్యాదలకి సంతోషించి ,అదృష్ట దేవత, ఏదైనా వరం కోరుకోమంది. ఆ రాజు అస్సలు ఆలోచించకుండా, “నేను ఏది నా చేతితో తాకితే, అది బంగారం గా మారాలని,” కోరాడు.
దేవత కి తెలుసు ఇదేమంత గొప్ప వరం కాదని, కానీ అడిగాడని, కాదనక, రాజుకా వరం ఇచ్చేసింది. రాజు మహా సంతోషంతో, ఎదురుగా ఉన్న ఒక ఆపిల్ పండు ని ముట్టుకున్నాడు. అది వెంటనే మెరిసిపోతూ బంగారు పండు గా మారిపోయింది. ఇంకా వెర్రి ఆనందంగా రాజా భవనం లోని వొస్తువుల్ని బంగారు మయం చేస్తుండగా, అక్కడికి వాళ్ళమ్మాయి వొచ్చింది.
పరమానానందంతో గబా గబా వెళ్లి పట్టేసుకున్నాడు. అంతే, ఆ పాప జీవం లేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది. అదిచూసి రాజు ఏడుస్తూ, ఆ అదృష్ట దేవత కోసం ప్రార్ధించాడు. “నాకీ శక్తి వొద్దు. నా పిల్ల కి మామూలు రూపం రావాలని,” ప్రార్ధించాడు. బంగారంగా మారినవన్నీ మళ్ళీ యధా రూపం లోకి వొచ్చాయి. అమ్మాయిని చూసుకుని రాజు మురిసిపోయాడు. రాజుకి బుధ్ధి వొచ్చింది. తనకున్న దానితో హాయిగా, తృప్తిగా జీవించటం నేర్చుకున్నాడు.
కథ యొక్క నీతి: అత్యాశకి పోరాదు. మనకున్నదానిలో సంతృప్తి గా ఉండటం మంచిది.
———————-
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, friendship story, friendship kathalu
నీతి కథల మీద మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. What is your opinion on fables? Can be specified in the comment section below.
Comments
very nice story
Clever goat moral story for children
King and silly monkey moral story