telugu  lo stories kathalu  heart touching story ……


ఇది యదార్థంగా జరిగిన సంఘటన……….దయచేసి చదవగలరు……
ఒక భార్య ..భర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు….వారి అన్యోన్యతకు గుర్తుగా
వారికి ఓ కుమార్తె పుట్టింది…….చాలా సంతోషంగా ఉన్నదాంట్లొనే
ఎంతో తృప్తిగా ఉండేవారు…… . http://telugulostories.blogspot.com/search/label/moralkathalu
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu

పాపకు నాలుగు సంవత్సరాల వయస్సు. ఆ పాప తల్లి ఒకరోజు తన కూతురితో
“నీకు ఒక తమ్ముడు పుడతాడు కొద్దిరోజుల్లో….నీవు వాడిని బాగా చూసుకోవాలి
వాడితో గొడవపడకుండా బుద్ధిగా ఆడుకోవాలి . వాడికి ఏ లోటూ రాకుండా
చూసుకోవాలి ” అని చెప్పింది…. అప్పటినుండి ఆ పాప రోజూ అమ్మ నాన్నలను
తమ్ముడు ఎప్పుడొస్తాడు అని అడుగుతూ ఉండేది……..తన తమ్ముని మీద
ఎనలేని ప్రేమను అనురాగాన్ని పెంచుకోసాగింది……..
నెలలు నిండి ఆ తల్లి నిజంగానే ఓ మగ శిశువును ప్రసవించింది…..కానీ…..
ఆ బిడ్డకు ఏదో తీవ్ర అనారోగ్యం వలన ఆ బిడ్డను ఇంటెంసివ్ కేర్లో ఉంచాల్సి
వచ్చింది….ఈ పాపకేమో తన తమ్ముడిని చూడాలని ఆశగా ఉంది…కానీ
ఆ గదిలోకి ఎవరినీ వెళ్ళనివ్వడంలేదు……అమ్మను అడిగింది…..వాళ్ళ
నాన్నను బ్రతిమలాడింది……పాప నాన్న ఆ పాపను ఎత్తుకుని
తమ్మునికి ఆరోగ్యం బాలేదు నువ్వుకూడా విసిగించకు అని మెల్లగా
చెప్పాడు……..కానీ ఆ పాప అస్సలు వినడంలేదు……ఇలా అంది.
నాన్నా! ఒక్కసారి నాకు నా తమ్ముడిని చూపించండి..వాడిదగ్గరికి
నన్ను తీసుకెళ్ళండి .వాడికి ఏమీ కాదు….ప్లీజ్ ,,,,,,,వాడితో
నేను ఆడుకోవాలి. నా తమ్ముడి దగ్గరికి ఎందుకు నన్ను తీసుకెళ్ళడంలేదు
అని బిగ్గరగా ఏడ్చింది…….

ఆ పాప ఏడుపును ఆపకపోయేసరికి ………తండ్రి డాక్టరుదగ్గరికి వెళ్ళి
మా బాబు బ్రతికి ఉంటాడో లేదో మాకు భయంగా ఉంది కనీసం ఈ పాపనైనా
బ్రతికించుకోవాలి. బాబుని ఒక్కసారి పాపకు చూపించి తీసుకువస్తాను .దయచేసి
అనుమతిని ఇవ్వండి….అని అడిగాడు……..
డాక్టర్లు కూడా ఆ పుట్టిన బిడ్డ పరిస్థితి సరిగ్గా లేదని..అసలు చలనమే లేదనీ
చెప్పి………ఒక్కసారి ఆ పాపను తన తమ్ముని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి
అనుమతినిచ్చారు……
పాప తన ఏడుపును ఆపి తన తమ్ముడిని చూడటానికి గదిలోకి వెళ్ళింది…….
” తమ్ముడూ! లెయ్యిరా! నేను నీ అక్కను……….అమ్మ నువ్వు వస్తావనీ
నేను నిన్ను బాగా చూసుకోవాలని,,,,,నీతో బాగా ఆడుకోవాలని చెప్పింది.
చాలా రోజులు ఎదురుచూశాను. ఇప్పుడు ఇలా పడుకుని ఉన్నావే!
లెయ్ …….మనం ఆడుకుందాం ” అంటూ ఆ బాబు చేతివేళ్ళను మెత్తగా
తాకింది…”


ఆశ్చర్యంగా ఆ పసిబిడ్డ కళ్ళు తెరిచి అలా చూసి ఏడుపు మొదలెట్టాడు..
అంతవరకు చలనమే లేని ఆ పసిబిడ్డ అలా ఏడవగానే డాక్టర్లు పరుగున
ఆ గదిలోకి చేరుకుని ఇక ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు….
ఇది కట్టుకథ కాదు……ఒక పాప మనసులో తన తమ్ముడిపై పెంచుకున్న
ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా ఆ బిడ్డను చేరాయి…..ఆ బిడ్డ ప్రాణాలతో
బయటపడ్డాడు…….వింతగా లేకపోయినా ఇందులో తెలుసుకోవలసిన
అంశం ఉంది……పసిపిల్లల ప్రేమ………అనురాగం…….నిజంగా


ఆ దేవుడి ఆశీస్సులతో సమానం కదా!

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
Spread the love

Comments

Leave a Reply

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.