Telugu lo stories kathalu neethi kathalu manchi kathalu
రమేష్ ఒక టైలర్ కొడుకు B.Tech చదువుతున్నాడు. చాలా డిప్రషన్లో ఉన్నాడు. తనకంటే తక్కువ మార్కులు తెచ్చుకపంటున్న శ్రీమంతుల పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, బైక్, కొందరికి కార్లు ఉన్నాయి.
తనకే కనీసం మంచి ఫోనైనాలేదు. స్నేహితులముందు అవమానంగా ఉంది. స్నేహితులు చులకనగా చూస్తున్నారు.
తన కనీస కోర్కెలు తీర్చలేనివాడు నాన్నకు పెళ్ళెందుకూ, పిల్లలెందుకు. కోపంతో ఊగిపోయాడు.
ఈ అవమానంతో బతికేకంటే చద్దామని నిర్ణయించుకున్నాడు.
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
తలుపు తీసుకుని బయటకు వస్తుంటే అమ్మానాన్న మాటలు వినబడు తున్నాయి. ఒక్కక్షణం నిలబడి విన్నాడు.
తల్లి :- బాగాదగ్గు తున్నారు. డాక్టరు వద్దకు వెళ్ళి చూపించుకోవచ్చుగా?
తండ్రి:- చూపించాను. TB అన్నారు. వైద్యానికి పది పదిహేను వేలౌతాయన్నారు.
తల్లి:- ఈనెల్లో చీటీవస్తుంది కదా చూపించుకోండి.
తండ్రి:- ఆడబ్బు అబ్బాయి సెల్ కోసంకేటాయించాను.
తల్లి:- మీఆరోగ్యం కంటే వాడి ఫోన్ ముఖ్యమా?
తండ్రి:- నీకు నేను ముఖ్యం. నాకు వాడు ముఖ్యం. వాడి కోర్కెలేవీ తీర్చలేక పోతున్నాం. కనీసం ఇదైనా తీర్చకుంటే ఎలా?
తల్లి:- మరిమీ ఆరోగ్యం?
తండ్రి:- మనకింకెన్నాళ్ళే కష్టాలు? ఇంకోరెండేళ్ళలో వాడిచదువు పూర్తి ఐపోతుంది. నన్నూ నిన్ను అసలు పనిచేయనీయడు. మంచిగా చూసుకుంటాడు. అప్పుడు నువ్వు రాజమాత నేను వృద్ధరాజు. దర్జాగా బతికేద్దాం.
రమేష్ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఎంత ఆశ పెట్టుకున్నావ్ నాన్నా! నీ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నాకు ఫోన్ కొందామనుకున్నావా? మరి నేనేమో నిన్ను వంటరిచేసి పోదామనుకున్నాను.
ఎంత ద్రోహం. నాకు ఫోన్ వద్దు. నీ ఆరోగ్యమే ముఖ్యం.
నేను బాగా చదువుతా క్యాపస్ ఉద్యోగం సంపాదిస్తా నిన్ను రాజులాగా చూసుకుంటా అనుకుని గదిలోకెళ్ళి పడుకున్నాడు.
రేపే నాన్నను ఒప్పించి డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళాలి అని అనుకుంటూ తృప్తిగా నిద్రపోయాడు.
నీలం రంగు నక్క :
ఒకప్పుడు అడవిలో ఒక నక్క ఉండేది. అది ఆహారం కోసం ఒక నగరానికి నివసించడానికి వచ్చింది. నక్క ఆకలితో తిరుగుతుంది, అంతలో ఒక కుక్కలగుంపు నక్కను వెంబడించాయి.
ఆ నక్క అనుకోకుండా కలర్ వేస్తున్న ఇంట్లోకి ప్రవేశించి, బ్లూ(నీలం) రంగు కలిపి ఉన్న బకెట్ లో పడిపోయింది. దాని తల నుండి అరికాలి వరకు నీలం రంగు అంటుకుంది. నక్క భయంతో ఆ ఇంటి నుండి తప్పించుకుని తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది, జంతువులన్నీ నక్క రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మరియు దానిని చూసి గుర్తించలేకపోయాయి.
ఇప్పుడు నేను ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని, నక్క నిర్ణయించుకుంది. నక్క తనను తాను ‘భయంకరమైన గుడ్లగూబ‘ అని మిగతా జంతువులతో చెప్పింది, “దేవతల రాజు ఇంద్రుడు ఈ అడవిని కాపాడటానికి నన్ను భూమికి పంపాడు.” అని చెప్పింది.
అక్కడ ఉన్న అన్నిజంతువులు నక్కను నమ్మాయి. నక్క అప్పుడు సింహాన్ని తన మంత్రిగా, పులిని తాను నిద్రపోయేటప్పుడు బాడీ గార్డ్ గా, మరియు ఏనుగును ఎల్లప్పుడు తనకు రక్షణగా ఉండాలని నియమించింది.
మరియు తనను గుర్తుబడతాడనే భయంతో అడవుల నుండి అన్ని నక్కలను చూడకుండా తరిమివేసింది. జంతువులు ఆహారాన్ని వేటాడి, స్వయంగ ప్రకటించుకున్న నక్కరాజు వద్దకు తీసుకువస్తాయి, మరియు రాజు చేసే విధంగానే నక్కరాజు కూడా అందరికీ సమానంగా ఆహారాన్ని పంపిణీ చేస్తుంది. అందువలన నక్క విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది.
ఒక రోజు నక్కలగుంపు అడవికి దగ్గరగా అరుస్తూ వెళ్తున్నాయి. అప్పుడు నక్క తన సహజ స్వభావాన్ని నియంత్రించలేక, దాని గొంతు పైకి పెట్టి అరిచింది. ఆ అరుపులు విన్న మిగతా జంతువులు తమను ఒక నక్కతో మోసగించిందని గ్రహించి, నక్కను తక్షణమే చంపాయి.
నోట్:- ఇది మీకు తెలిసిన కుర్రాళ్ళకందరికీ పంపండి ప్లీజ్..
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
Comments